News April 17, 2025
గద్వాల: క్రికెట్ బెట్టింగ్.. ఏడుగురిపై కేసు నమోదు

తనగల గ్రామానికి చెందిన వీరేంద్ర ఆచారి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం మేరకు వడ్డేపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వీరేంద్రతో పాటు మరో ఆరుగురిపై విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో క్రికెట్ బెట్టింగ్ ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో బెట్టింగ్ ఆడేవారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.
Similar News
News April 19, 2025
ALERT: నేడు భారీ వర్షాలు

AP: నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News April 19, 2025
మల్లాపూర్: చెరువులో పడి బాలుడి గల్లంతు

మల్లాపూర్ మండల శివారులోని లింగన్నచెరువులో శుక్రవారం బాలుడు గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట రాజేశ్(13) చెరువులోకి స్నానానికి వెళ్ళి గల్లంతైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఒడ్డున బాలుడి దుస్తులు, చెప్పులు ఉండటంతో పొలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ళతో చెరువులో వెతికిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
క్రికెట్ బెట్టింగ్.. చల్లపల్లిలో ఏడుగురు అరెస్ట్

చల్లపల్లిలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిని పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆదేశాల మేరకు సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో విస్తృత తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది క్రికెట్ బెట్టింగ్ జూదరులను గుర్తించినట్లు తెలిపారు. వారిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.