News January 7, 2026
గద్వాల: ఖరీఫ్ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి

రైతుల నుంచి 2025- 26 ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ధాన్యం డబ్బులు చెల్లింపు, సీఎంఆర్ సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024- 25కు సంబంధించిన సీఎంఆర్‌ను ఫిబ్రవరి 28 వరకు పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీఎస్ఓ పాల్గొన్నారు.
Similar News
News January 9, 2026
VKB: ఊరెళ్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

సంక్రాంతి సెలవుల్లో ఇళ్ల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సూచించారు. పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే వారి నివాసాల వద్ద దొంగతనాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, అపార్ట్‌మెంట్‌లలో రాత్రివేళ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. తాళం వేసిన ఇళ్ల వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు.
News January 9, 2026
తల్లిపాల విషయంలో ఈ అపోహలు వద్దు

పిల్లలకు తల్లిపాలు అమృతతుల్యం. అయితే అపోహలతో కొందరు పిల్లలకు సరిగా పాలు పట్టట్లేదంటున్నారు నిపుణులు. సరిపడా పాలు రావట్లేదని కొందరు ఫార్ములా మిల్క్ ఇస్తుంటారు. కానీ పిల్లల తరచూ పాలు ఇస్తుంటేనే పాలు ఎక్కువగా ఉత్పత్తవుతాయంటున్నారు. అలాగే ఫార్ములా మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. తల్లిపాలలో ఇమ్యునిటీ, ఐక్యూ బెటర్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలకు తల్లిపాలే ఉత్తమం అని చెబుతున్నారు.
News January 9, 2026
ఇళ్లు, పొలం దగ్గర ఈ మొక్కల పెంపకంతో ఆహారం, ఆరోగ్యం

బొప్పాయి, అరటిలో పిండి పదార్థాలతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి, జామ, నిమ్మలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మునగ, అవిసె, బచ్చలి, ఆకుకూరల నుంచి పీచుపదార్థం, ఖనిజ లవణాలు మెండుగా అందుతాయి. కరివేపాకు క్యాన్సర్ నిరోధకారిగా పనిచేస్తుంది. కుంకుడు తల వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడి అనేక ఔషధ గుణాలు కలిగి మంచి ఆరోగ్యాన్నిస్తుంది.


