News March 24, 2025
గద్వాల: గడువు కాలం మరో మూడు నెలలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి నూతన అక్రిడేషన్ జారీ చేయకుండా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ గడువు కాలాన్ని పెంచుతుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 14, 2025
బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో వేద పండితుల మధ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు శుభాకాంక్షలు చెప్పారు.
News September 14, 2025
SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 14, 2025
జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.