News December 28, 2025
గద్వాల: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గురుకుల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 29, 2025
అసెంబ్లీలో కేసీఆర్ Vs కడియం..!

నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసు చివరి దశ సమయంలో కేసీఆర్ హాజరవుతుండడం, మరో పక్క పార్టీ మారలేదంటూ బుకాయించిన ఫిరాయింపు MLAలను కేసీఆర్ ఎలా చూస్తాడో అనే ఆసక్తి నెలకొంది. వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి ఉన్నారు. కేసీఆర్, కడియం శ్రీహరికి బీఆర్ఎస్‌లో పెద్దపీటే వేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో వారిద్దరి రియాక్షన్‌ల పైనే అందరి కన్నుంది.
News December 29, 2025
సిగాచి ప్రమాదం: ‘ఎట్టకేలకు 8మందికి డెత్ సర్టిఫికెట్లు’

సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఆచూకీ లభ్యం కానీ ఎనిమిది మంది కార్మికుల డేత్ సర్టిఫికెట్లు ఎట్టకేలకు ఇవ్వనున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో సోమవారం ఉదయం 11 గంటలకు వీరి డెత్ సర్టిఫికెట్లను అందజేస్తామని మున్సిపల్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. డేత్ సర్టిఫికెట్ల కోసం పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గత సోమవారం కలెక్టర్‌ను కలిసిన విషయం తెలిసిందే.
News December 29, 2025
విజయవాడ గ్రేటర్ హామీ నెరవేరకుండానే ఎన్నికలకు.. మరో’సారీ’..!

గ్రేటర్ విజయవాడ కల సాకారానికి మరింత సమయం పట్టేలా ఉంది. కేంద్రం జనగణన పూర్తి చేసిన తర్వాత గ్రేటర్ విజయవాడపై ఫోకస్ పెడతామని మంత్రి నారాయణ అన్నారు. మరోవైపు జనగణనతో సంబంధం లేకుండా జిల్లాలు, రెవిన్యూ డివిజన్స్ ప్రక్రియ ముందుకెళ్తుండగా.. గ్రేటర్ విజయవాడకి అన్ని అడ్డంకుల్లా కనిపిస్తోంది. ఇక వచ్చే ఏడాదిలో జరగనున్న విజయవాడ కార్పొరేషన్ ఎన్నిలల్లోను గ్రేటర్ లేకుండానే నేతలు ముందుకెళ్ళానున్నారు.


