News April 4, 2025
గద్వాల: గోడపత్రికలను విడుదల చేసిన జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అంబేడ్కర్ ఆలోచన పండగ గోడపత్రికలను కలెక్టర్ సంతోష్ విడుదల చేశారు. ఆల్ ఇండియా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12న జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ ఆలోచన పండుగను నిర్వహిస్తున్న సందర్భంగా గోడపత్రికలను విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచన పండుగకు హాజరై విజయవంతం చేయాలన్నారు. బుడకల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 11, 2025
జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్‌షా

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.
News April 11, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,650

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.
News April 11, 2025
త్వరలో ఏనుగుల తరలింపు: మంత్రి

ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు.