News August 22, 2025
గద్వాల: గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్ని’కల’య్యేనా?

జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా వాటిలో 2,390 వార్డులు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి 1 నుంచి పాలకవర్గాల గడువు ముగియడంతో గ్రామాల్లో 18 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాల పాలన లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం పలుమార్లు స్థానిక సంస్థల ఎన్నికలకు అడుగులు వేస్తున్న కార్యరూపం దాల్చడం లేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
Similar News
News August 22, 2025
రాయికల్: ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడి మృతి

రాయికల్ మం. అల్లిపూర్‌కు చెందిన బరతాల రాజేందర్(30) అనే దివ్యాంగుడు RTC బస్సు ఢీకొని మృతిచెందినట్లు ఏఎస్ఐ దేవేందర్ శుక్రవారం తెలిపారు. గ్రామంలో గురువారం రాత్రి రాజేందర్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు చెప్పారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు.
News August 22, 2025
గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్‌లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
News August 22, 2025
BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <