News December 29, 2025

గద్వాల: గ్రీవెన్స్ డేకు 20 ఫిర్యాదులు- ఎస్పీ శ్రీనివాసరావు

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కు 20 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భూ వివాదాలకు సంబంధించి 10, గొడవలకు సంబంధించి 2, భార్యాభర్తల తగాదా 1, ఇతర అంశాలకు సంబంధించి 7 మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

Similar News

News January 1, 2026

అమలాపురం: చిప్పలతో సిరి.. కొబ్బరి ఉత్పత్తులకు కొత్త కళ!

image

కోనసీమ కొబ్బరి చిప్పలు ఇప్పుడు కళాఖండాలుగా మారుతున్నాయి. జనుపల్లిలో ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కొబ్బరి ఉప ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నారు. పారేసే చిప్పలతో అందమైన గాజులు, ఉంగరాలు, సెల్‌ఫోన్ స్టాండ్లు తయారు చేస్తూ మహిళలు ఉపాధి పొందుతున్నారు. మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో సృజనాత్మకతకు ఆదాయం తోడవుతోంది. వస్తువుల తయారీ ఇక్కడి మహిళల ఆర్థిక స్థితిగతులను మారుస్తోంది.

News January 1, 2026

కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు: బాలకిష్టారెడ్డి

image

TG: కాలం చెల్లిన సిలబస్‌ను పక్కన పెట్టి, మార్కెట్‌కు అవసరమైన సబ్జెక్టులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ‘విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేలా సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రూపొందించాం. సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో లింక్ చేశాం. ఉపాధి దొరికే కోర్సులకే ప్రయారిటీ ఇస్తాం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచుతాం’ అని తెలిపారు.

News January 1, 2026

ఖమ్మం: ఇంటర్నేషనల్ బాల్ బ్యాడ్మింటన్‌లో శశికళకు స్వర్ణం

image

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చిరునోములు గ్రామానికి చెందిన శశికళ అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. బిహార్‌లో జరిగిన ఈ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడి దేశానికి పేరు తెచ్చారు. గతంలో తొమ్మిది జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, కోచ్ శిక్షణే కారణమన్నారు. శశికళ సాధించిన ఈ ఘనతపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.