News February 23, 2026
గద్వాల: గ్రీవెన్స్ డే.. 10 ఫిర్యాదుల స్వీకరణ

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఇందులో మొత్తం 10 ఫిర్యాదులు అందాయి (భూవివాదాలు-3, గొడవలు-3, మోసం-1, ఇతరాలు-3). వీటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News February 23, 2026
SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.
News February 23, 2026
కట్టుదిట్టంగా గోదావరి పుష్కరాల నిర్వహణ: కలెక్టర్

రాబోయే గోదావరి పుష్కరాలు-2027ను అత్యంత వైభవంగా, పకడ్బందీ ప్రణాళికతో నిర్వహిస్తామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏడు ప్రధాన శాఖల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
News February 23, 2026
ప్రజావాణిలో అర్జీలకు ప్రాధాన్యత: కలెక్టర్

పెద్దపల్లిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భూమి పట్టా, అక్రమ నిర్మాణాల తొలగింపు, పట్టా పుస్తక జారీ వంటి సమస్యలపై సంబంధిత తహసిల్దార్లు, మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.


