News April 21, 2025

గద్వాల: చట్టంలో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారు..?: సరిత

image

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ముస్లిం నేతలు నిర్వహించిన భారీ ర్యాలీకి ఆమె మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టంలో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 21, 2025

ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

image

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

News April 21, 2025

నరసరావుపేట: విద్యార్థిగా మారిన జిల్లా కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు విద్యార్థిగా మారారు. స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో తరగతుల ట్రాన్సిషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్నారు. వారితో కలిసి పాఠాలు విన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News April 21, 2025

ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

image

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!