News February 23, 2026

గద్వాల: చట్టాలపై అవగాహనతోనే హక్కుల రక్షణ: అదనపు కలెక్టర్

image

పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 2013లో పోష్ (POSH) చట్టం అమల్లోకి వచ్చినా, మహిళలపై వేధింపులు కొనసాగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే నిందితులకు శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 25, 2026

శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్య

image

శ్రీకాకుళంలోని వాంబే కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ వివరాల ప్రకారం.. యడగళ్ల పవన్ కుమార్ (27) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. బుధవారం ఉదయం నివాసం సమీపంలోని ఇదే సముదాయంలోని 17వ నంబరు బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉరి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 25, 2026

నిర్మల్: మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించి, కేసులు నమోదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News February 25, 2026

HYD: Weekendలో బెస్ట్ టూర్ ఇదే!

image

నిత్యం ఉరుకుల పరుగుల నగర జీవితంతో అలసిపోయిన వారికి ఈ వీకెండ్‌లో మనశ్శాంతిని పంచే అద్భుత టూర్‌ ఒకటుంది. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మానసిక ప్రశాంతతకు నిలయంగా విరాజిల్లుతోంది. HYD నుంచి జస్ట్ 150KM మాత్రమే. అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలను ఒకే చోట చూడొచ్చు. నాగార్జునసాగర్, వాటర్ ఫాల్స్, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉంది. రెండ్రోజులు చిల్ అవ్వొచ్చు. ప్లాన్ చేసుకోండి.