News March 29, 2025
గద్వాల: చింతరేవులశ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి.లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకుడు ఆద్య కృష్ణాచారి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News September 17, 2025
US జోక్యాన్ని భారత్ ఒప్పుకోలేదు: పాకిస్థాన్

OP సిందూర్ నిలిపివేయడం వెనుక అమెరికా హస్తంలేదని తాజాగా పాక్ ఉప ప్రధాని మహ్మద్ ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. ‘మేము US విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో తృతీయ పక్షం జోక్యం గురించి చెప్పాం. బయటి వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవట్లేదని ఆయన మాతో చెప్పారు. వాష్గింగ్టన్‌లో మళ్లీ నేను అదే ప్రస్తావించాను. ఇది పూర్తిగా ద్వైపాక్షికంగానే పరిష్కారమవ్వాలని ఇండియా తెగేసి చెప్పినట్లు బదులిచ్చారు’ అని తెలిపారు.
News September 17, 2025
చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.
News September 17, 2025
చాకలి ఐలమ్మ స్ఫూర్తి యోధులు వీరే..!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరికొందరు పోరాట యోధులు ఆమె పోరాట శైలిని స్ఫూర్తిగా తీసుకొని సాయుధ పోరాటంలో ఉద్యమించి ప్రాణాలర్పించారు. వారే పాలకుర్తికి చెందిన జీడి సోమయ్య, చాకలి సోమయ్య, మామిండ్ల ఐలయ్య, ఆకుల వెంకటయ్య, కమ్మరి బ్రహ్మయ్య, చుక్కా సోమయ్య, జీడి బాలయ్య, జీడి కొమురయ్య, వీరమనేని రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.