News February 15, 2026
గద్వాల ఛైర్మన్ ఎన్నిక.. ఇద్దరికే ‘ఎక్స్ అఫీషియల్’ ఓటు!

గద్వాల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీలను మాత్రమే రిటర్నింగ్ అధికారులు ఎక్స్ అఫీషియల్ ఓటర్లుగా ఖరారు చేశారు. గడువు ముగిసే వరకు కేవలం కాంగ్రెస్ మాత్రమే దరఖాస్తు చేయడంతో, సోమవారం జరగనున్న ఎన్నికలో ఎంపీ డాక్టర్ మల్లు రవి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News February 16, 2026
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి: ADB కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రోటీన్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.
News February 16, 2026
రంజాన్.. నగరానికి వచ్చేసింది పోషకాల ఖర్జూర్

రంజాన్ మాసంలో ఉపసవాసమున్న వారు ఇష్టపడేది ఖర్జూర్.. ఉపవాసం ముగించేటపుడు ఖర్జూర్‌ను తప్పకుండా తీసుకుంటారు. ఈ 4 రోజుల్లోనే నగరానికి దాదాపు 3వేల టన్నుల విదేశీ ఖర్జూర్ దిగుమతి అయిందని వ్యాపారులు చెబుతున్నారు. దాదాపు 100 రకాల ఖర్జూరం సిటీలో అందుబాటులో ఉంది. రకాన్ని బట్టి కిలో రూ.100 నుంచి రూ.2,200 వరకు ఉంటుంది. ఈ నెల 19 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని సమాచారం.
News February 16, 2026
జనగామ మున్సిపాలిటీ కార్యాలయ పరిధిలో నిషేధాజ్ఞలు

జనగామ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎంపిక నేపథ్యంలో జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. మున్సిపల్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.


