News March 28, 2025
గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Similar News
News March 31, 2025
గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్‌సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్‌కుమార్‌కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్‌కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.
News March 31, 2025
నాగార్జున సాగర్ సమాచారం

☞పూర్తిస్థాయి నీటి మట్టం – 590.00 అడుగులు
☞టీఏంసీలు – 312.0450
☞ప్రస్తుత నీటిమట్టం – 521.70
☞టీఏంసీలు – 152.3944
☞ఎడమ కాల్వకు నీటి విడుదల – 7190
☞కుడికాల్వకు – 5088
☞విద్యుత్ కేంద్రం ద్వారా – 0
☞క్రస్ట్ గేట్ల ద్వారా – 0
☞ఎస్‌ఎల్‌బీసీ ద్వారా – 1300 క్యూసెక్కులు
☞వరద కాల్వ ద్వారా – 300 క్యూసెక్కులు
☞ఇన్‌ఫ్లో – 0
☞అవుట్‌ఫ్లో – 13.938 క్యూసెక్కులు
☞ఎన్ని గేట్ల ద్వారా – నిల్
News March 31, 2025
గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఎర్రవల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల మం. గుంటిపల్లికి చెందిన రాజన్న(60) శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదైంది.