News April 11, 2025
గద్వాల జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో ఉన్న జమ్ములమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News October 26, 2025
మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలుఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మసమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
దిలావర్‌పూర్‌లో అత్యధికం

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా దిలావర్‌పూర్ మండలంలో 62.2 మి.మీ., సారంగాపూర్‌లో 51.2 మి.మీ. వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 26, 2025
కొమురం భీమ్ గురించి తెలుసుకోండి: మోదీ

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.


