News April 8, 2025

గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మ దీపాల కాంతుల్లో భక్తులకు దర్శనం

image

జమ్మిచేడు జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి ఆలయ ఆవరణలో జమ్ములమ్మను చేసి సారేతో కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Similar News

News November 9, 2025

6,000 మందితో గీతా పారాయణం

image

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.

News November 9, 2025

మరిపెడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

image

మరిపెడ మండలం బురహానుపురం శివారులోని జాతీయ రహదారిపై సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాలిలా.. సూర్యాపేట జిల్లా ఇటిక్యాలపల్లికి శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం వాసి రాము బైక్‌పై బురహానుపురం నుంచి మరిపెడకు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చందు దుర్మరణం చెందగా, గాయపడిన రామును ఆస్పత్రికి తరలించారు.

News November 9, 2025

ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య షికార్లు చేస్తున్నారని YCP ఆరోపించింది. ‘మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఉత్తుత్తి పర్యటనలతో హడావుడి చేయడం తప్ప మీడియాను, నాయకులను ఎవర్నీ కలవడం లేదు. కేవలం సినిమా షూటింగ్ గ్యాప్‌లో రిలీఫ్ కోసం ఇలా టూర్‌ల‌కు వెళ్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.