News September 22, 2025
గద్వాల జిల్లాలో జాబ్‌మేళా

గద్వాల జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.ప్రియాంక తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. 18-35 ఏళ్ల వయసు గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Similar News
News September 23, 2025
NLG: బతుకమ్మ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో రోజుకో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయని ఆమె చెప్పారు. ఈ నెల 23న బుద్ధవనంలో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
News September 23, 2025
మృత్యుంజయుడు.. విమానం టైర్లలో ప్రయాణం

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు (గంటన్నర జర్నీ) ఓ 13 ఏళ్ల బాలుడు విమానం టైర్లలో దాక్కుని ప్రయాణించాడు. ఇరాన్‌కు పారిపోదామని పొరపాటుగా ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో కూర్చున్నాడు. ఆ టైర్లతో పాటు
అతడూ లోపలికి వెళ్లి నక్కి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. లేదంటే 30వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక, గడ్డకట్టే చలిలో చనిపోయేవాడని చెప్పారు. బాలుడు మైనర్ కావడంతో కఠిన చర్యలు ఉండవని తెలిపారు.
News September 23, 2025
జనగామ: పనులను త్వరగా పూర్తి చేయాలి: సీఎం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణ వంటి పనులపై సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ వీసీలో జనగామ ఇన్‌ఛార్జి కలెక్టర్ పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, తదితరులు పాల్గొన్నారు.