News March 13, 2025

గద్వాల జిల్లాలో దంచికొడుతున్న ఎండలు..!

image

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం మల్దకల్ లో అత్యధికంగా 39.7°c నమోదవ్వగా.. గద్వాల్ లో 38.9°c, ధరూర్‌లో 38.3°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 20, 2026

4.43 నిమిషాల భేటీ… ఖర్చు రూ.17 లక్షలు

image

AP: సమస్యలపై చర్చించాల్సిన శాసనమండలి రెండు రోజులుగా TTD లడ్డూపై రాద్ధాంతంతో పట్టుమని 10 ని.లూ నడవడం లేదు. ఇవాళ మరీ దారుణం. ఉ.10కి ప్రారంభమైన మండలి సభ్యుల ఆందోళనలతో ఛైర్మన్ మోషేన్ రాజు 4.03 ని.ల లోపే సభను వాయిదా వేశారు. 2 గంటల అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా అదే గందరగోళం కొనసాగడంతో 40 సెకన్లలోనే ముగించారు. GOVT గణాంకాల ప్రకారం ఒకరోజు పూర్తిగా సభ నిర్వహణకు రూ.17 లక్షల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది.

News February 20, 2026

మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..?

image

మంథనిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధికారుల పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొంతసేపు అయితే సోదాలకు సంబంధించి విషయం బయటకు తేలే అవకాశం ఉంది.

News February 20, 2026

కోతికి కొబ్బరిచిప్ప.. ట్రంప్‌కు అధ్యక్ష పదవి

image

మొన్నటిదాకా నోబెల్ శాంతి పురస్కారం కోసం తపించిన ట్రంప్‌కు కొత్త కోరిక పుట్టింది. స్వతహాగా రియల్టరైన తన పేరిట శాశ్వత నిర్మాణాలు లేకపోతే అమెరికాకు కళ ఉండదని కలగన్నారేమో. రాజధాని వాషింగ్టన్‌లోని కెనడీ స్మారక కాంప్లెక్సును ట్రంప్-కెనడీ సెంటర్‌గా మార్చేందుకు సైన్ చేసేసుకున్నారు. తాజాగా ప్రఖ్యాత పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంపన్న పేరు పెట్టి అనుగ్రహం పొందేందుకు ఫ్లోరిడా అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. కర్మ!