News September 10, 2025

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*గద్వాల: చాకలి ఐలమ్మ వర్ధంతి.
*లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి.
*పిడుగుపడి ముగ్గురు మృతి. *గట్టు: GPభవన నిర్మాణానికి భూమి పూజ.
*మల్దకల్: కాంగ్రెస్ నేత కు BRSలోకి రావాలని ఆహ్వానం. *అయిజ: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి *అలంపూర్: నవరాత్రి ఉత్సవాల పోస్టర్ విడుదల.
*మానవపాడు: ఉద్యోగులకు బదిలీలు సహజం.
*ఎర్రవల్లి: ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు చేయాలి.
*ధరూర్: జూరాల గేట్లు మూసివేత.

Similar News

News September 11, 2025

టీమ్ ఇండియాకు ఇదే ఫాస్టెస్ట్ విన్

image

ఆసియా కప్‌లో భాగంగా నిన్న UAEతో <<17672914>>మ్యాచులో<<>> భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. UAE నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ను ఇండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. మరో 93 బంతులు మిగిలి ఉండగానే విక్టరీని అందుకుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తన ఫాస్టెస్ట్ విన్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాంట్లాండ్‌పై సాధించిన విజయమే (81 బాల్స్ మిగిలి ఉండగా గెలిచింది) రికార్డుగా ఉంది.

News September 11, 2025

MHBD: దోమల నివారణకు ఫాగింగ్ జాడెక్కడ..?

image

జిల్లాలోని తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం పట్టణాల్లో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఏటా దోమల నివారణకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఆచరణలో ఫాగింగ్ కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News September 11, 2025

VZM: నేడు రాష్ట్రానికి చేరుకోనున్న యాత్రికులు

image

నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.