News March 25, 2025
గద్వాల జిల్లాలో భానుడి భగభగలు..!

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దిమ్మతిరిగేలా 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులను ఉపయోగించాలని ప్రభుత్వ అధికారులు ప్రజలకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సోమవారం మల్దకల్‌లో అత్యధికంగా 39.7°c నమోదవగా.. వెంకటాపూర్, కొలూర్ తిమ్మనదొడ్డిలో 38.6°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 4, 2025
విజయవాడలో ఫ్రీగా క్యాన్సర్ వ్యాక్సిన్.. ఎవరికీ తెలియనివ్వరా?

విజయవాడలోని కొత్త, పాత ఆసుపత్రుల్లో మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తుగానే వ్యాక్సిన్ వేస్తున్నారు. 5 రకాల క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుంది. రూ.3-5 వేల వరకు ఉండే ఈ వ్యాక్సిన్‌ను 9-15 ఏళ్ల బాలికలు, 15-30 మధ్య మహిళలకు 3 డోసులను అందిస్తారు. అయితే.. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం కనీసం ప్రచారం చేయట్లేదు. తెలిసిన వారికే ప్రాధాన్యం అన్నట్లు డోసులు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
News November 4, 2025
SRD: ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు

SRD జిల్లా ఝరాసంగం మం.లో ప్రేమ పెళ్లి చేసుకున్నారని యువతి కుటుంబీకులు దారుణానికి ఒడిగట్టారు. కొద్దీ రోజుల క్రితం విఠల్ కూతురు అదే గ్రామ వాసి రాధాకృష్ణను పెళ్లి చేసుకుంది. అదిఇష్టం లేని యువతి తండ్రి, కొడుకుతో కలిసి యువకుడిని, అతడి తండ్రిపై దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. యువకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 4, 2025
అల్లూరి జిల్లాలో భూకంపం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం నమోదైనట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ తన వెబ్‌సైట్‌లో మంగళవారం పొందుపరిచింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించిందని వెల్లడించింది. జి.మాడుగుల పరిసరాల్లో భూమి కంపించినట్లు కొందరు చెబుతున్నారు.


