News January 17, 2026

గద్వాల జిల్లాలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా..!

image

గద్వాల జిల్లాలో గద్వాల అయిజ వడ్డేపల్లి అలంపూర్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శనివారం వార్డులు, ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించింది. గద్వాల ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించింది. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Similar News

News January 25, 2026

తిరుమలలో మొదలైన హనుమంతుని వాహనసేవ

image

రథసప్తమి వాహన సేవల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి హనుమంత వాహన సేవ ప్రారంభమైంది. భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై మాడ వీధులలో ఊరేగనున్నాడు. గోవింద నామ స్మరణలతో మాఢ వీధులు మారుమోగుతున్నాయి.

News January 25, 2026

సింగ‌రేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు

image

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.

News January 25, 2026

అవార్డు అందుకున్న విజయనగరం కలెక్టర్

image

బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉత్తమ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, నూతన విధానాల అమలు వంటి అంశాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని అధికారులు ప్రశంసించారు.