News December 2, 2025
గద్వాల జిల్లాలో రెండవ రోజు 205 నామినేషన్లు

గద్వాల జిల్లాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు సోమవారం రెండో రోజు కొనసాగింది. రెండో విడతలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 74 సర్పంచ్ స్థానాలు ఉండగా 205 నామినేషన్లు వచ్చాయి. 716 వార్డు స్థానాలకు 341 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీగా వేసే అవకాశం ఉంది.
Similar News
News April 15, 2026
ఏప్రిల్ 15: చరిత్రలో ఈ రోజు

*1452: బహుముఖ ప్రజ్ఞాశాలి లియొనార్డో డావిన్సి జయంతి(ఫొటోలో)
*1469: భారత ఆధ్యాత్మిక గురువు గురునానక్ జయంతి
*1865: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం
*1912: టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజు
*1977: భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జననం
*ప్రపంచ కళా దినోత్సవం
*సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం
News April 15, 2026
విశాఖను సౌర హబ్‌గా తీర్చిదిద్దుతాం: MP భరత్

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్‌గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News April 15, 2026
పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?

AP: జనసేన అధినేత, DyCM పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట BRS పార్టీలో చేరారు. AP BRS అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.


