News March 2, 2026

గద్వాల జిల్లాలో రెండు నెలల్లో 14 పోక్సో కేసులు!

image

గద్వాల జిల్లాలో బాలికలపై అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు నెలల్లో ఏకంగా 14 పోక్సో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల వద్ద బైక్‌పై దింపుతామని నమ్మించి విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితులను వెంటనే అరెస్ట్ చేశారు. బాలల భద్రత అందరి బాధ్యతని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేయాలని పోలీసులు సూచించారు.

Similar News

News March 2, 2026

కడప జిల్లాలో రేపు బడులకు సెలవులు

image

హోలీ పండుగ సెలవు దినం రేపే అని కడప జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలండర్‌లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని కోరారు.

News March 2, 2026

వార్ ఎఫెక్ట్: 22% పెరిగిన గ్యాస్ ధరలు!

image

వెస్ట్ ఏషియా యుద్ధంతో యూరప్‌లో గంటల వ్యవధిలోనే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఏకంగా 22% ఎగిసినట్టు వార్తలు వస్తున్నాయి. సౌదీలోని అరామ్ కో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నష్టం విలువ $2 ట్రిలియన్ల పైనే ఉంటుందని అంచనా. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా నుంచి గ్యాస్, చమురు దిగుమతులను ఆపేసిన యురోపియన్లకు ఇది పెద్ద దెబ్బే. వారి స్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నది విశ్లేషకుల మాట.

News March 2, 2026

మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

image

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.