News August 21, 2025

గద్వాల జిల్లాలో 20.7 మిల్లీమీటర్ల వర్షం

image

గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 20.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గట్టులో 16.1, మానవపాడు 0.3, మల్దకల్ 4.0, ఎర్రవల్లి 0.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే కేటి దొడ్డి, ధరూర్, గద్వాల, ఇటిక్యాల, అయిజ, రాజోలి, వడ్డేపల్లి, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లో వర్షం కురవలేదు. వర్షం తెరపి ఇవ్వడంతో ఆయా మండలాల్లోని రైతులు, రైతు కూలీలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

Similar News

News April 12, 2026

సంగారెడ్డి: శివాలయంలో నాగుపాము

image

హత్నూర మండలం కాసాల గ్రామంలోని వెయ్యేళ్ల పురాతన మల్లన్న శివాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. గర్భగుడిలోని శివలింగంపై పాము పడగవిప్పి ఉండటంతో గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు బారులు తీరారు.

News April 12, 2026

11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.

News April 12, 2026

ఘట్‌కేసర్: మార్ఫింగ్ ఫొటోలతో మహిళకు సైబర్ వేధింపులు

image

సోషల్ మీడియాలో మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో వెలుగుచూసింది. స్థానికంగా నివసించే మహిళ (38) స్నాప్‌చాట్‌లో భద్రపరచిన చిత్రాలను దుండగులు దుర్వినియోగం చేసి అసభ్యకరంగా మార్చి బంధువులకు పంపారు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. బాధితురాలు 1930కు ఫిర్యాదు చేసి అనంతరం పోలీసులను ఆశ్రయించగా, నిందితుల కోసం సాంకేతిక దర్యాప్తు ముమ్మరం చేశారు.