News February 3, 2026
గద్వాల జిల్లాలో 285 క్యాన్సర్ కేసులు నమోదు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ దాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 285 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 131 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 4, 2026
U19 WC: భారత్ రికార్డు

అండర్-19 మెన్స్ వరల్డ్ కప్‌లో భారత్ డామినేషన్ కొనసాగుతోంది. టీమ్ ఇండియా ఫైనల్ చేరడం U19 WC చరిత్రలో ఇది పదో సారి. దీంతో మొత్తం 16 ఎడిషన్లలో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇవాళ SF-2లో AFGపై 311 పరుగులు ఛేదించగా, U19 WC హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. మరోవైపు వరుసగా 6 ఎడిషన్లలో (2016, 18, 20, 22, 24, 26) భారత్ ఫైనల్ చేరడం విశేషం.
News February 4, 2026
SRPT: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలు సవ్యంగా, నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పోలీస్ శాఖ నూతనంగా చేపట్టిన ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
News February 4, 2026
ఈనెల 7న జాబ్ మేళా.. 60 మందికి ఉద్యోగావకాశాలు

ఈనెల 7న వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య తెలిపారు. వివిధ కంపెనీలలో 60 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల నిరుద్యోగులు ఈనెల 7న ఉదయం 11 గంటలకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.


