News April 4, 2025
గద్వాల జిల్లా ఎస్పీ ఆదేశాలు

వేధింపులు, అత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, బాలలకు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న న్యాయసలహా, తదితర సేవలు సత్వరమే అందించాలని, వేధింపులు గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు.
Similar News
News April 4, 2025
నిడదవోలు నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

ఈ నెల 6న భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి భద్రాచలం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిడదవోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. భక్తులు యావన్మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూసి తరలించాలని పేర్కొన్నారు.
News April 4, 2025
చిత్తూరు: 11 లోపు అభ్యంతరాలు చెప్పండి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జడ్పీ, మున్సిపాలిటీ, నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్స్/పీఈటీల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ లోపు తన కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈవో వరలక్ష్మి చెప్పారు. ఆ తర్వాత అభ్యంతరాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
News April 4, 2025
జర్మనీకి కుంభమేళా పవిత్ర జలాలు

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగిన మహాకుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర గంగా జలాలను యూపీ ప్రభుత్వం విదేశాలకు పంపుతోంది. మొదటగా మహా ప్రసాదం పేరుతో వెయ్యి బాటిళ్లను(ఒక్కోటి 250ml) జర్మనీలోని భక్తులకు ఎగుమతి చేసింది. ఇప్పటికే UPలోని 75 జిల్లాలతోపాటు దేశవ్యాప్తంగా 50వేల బాటిళ్లను సరఫరా చేసినట్లు తెలిపింది. కుంభమేళాకు హాజరుకాలేకపోయిన వారికి జలాలను పంపి ఈ మహావేడుకలో భాగం చేస్తున్నట్లు పేర్కొంది.