News April 18, 2025
గద్వాల జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్‌పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలపై రివ్యూ సమావేశం పోలీస్ అధికారులతో నిర్వహించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడాలన్నారు.
Similar News
News February 11, 2026
మక్తల్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి: ఎస్పీ వినీత్

మక్తల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంతో పాటు గార్లపల్లిలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు బందోబస్తును ఆయన నిశితంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి భద్రతా పరమైన సూచనలు చేస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News February 11, 2026
T20 WC వివాదం.. మాట మార్చిన బంగ్లాదేశ్

T20 WC నుంచి తమ జట్టు <<18918050>>తప్పుకోవడంపై<<>> బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ మాట మార్చారు. ఈ నిర్ణయం ఆటగాళ్లు, బోర్డుదని, ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు. కానీ ఇండియాకు వెళ్లొద్దని తమ ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఈయనే గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ‘WC ఆడకపోవడంపై బాధ లేదు. జాతీయ గౌరవాన్ని కాపాడేందుకు ప్లేయర్లు, BCB తీసుకున్న నిర్ణయమిది. మాపై ఆంక్షలు ఉండవని ICC చెప్పడం భారీ విజయం’ అని చెప్పుకొచ్చారు.
News February 11, 2026
జైలులో గాంధీ మార్గం.. అత్యాచార నిందితుడికి శిక్షాకాలం తగ్గింపు!

అత్యాచార నిందితుడి జీవిత ఖైదును ముంబై హైకోర్టు 12 ఏళ్లకు తగ్గించింది. జైలులో అతడు గాంధీ ఆలోచనలపై పరీక్షలు రాయడం, వ్యాస రచన వంటి విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని అతనిలో వచ్చిన ‘మార్పు’గా గుర్తించింది. 2016లో ఐదేళ్ల బాలికపై జరిగిన రేప్ కేసులో ఈ నిందితుడి వయసు (నేరం జరిగినప్పుడు 20 ఏళ్లు), పదేళ్లుగా బెయిల్ లేకుండా జైలులో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.


