News April 4, 2025
గద్వాల జిల్లా కలెక్టర్ ముఖ్య గమనిక

LRS స్కీం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం కల్పించిన 25 శాతం రిబేట్ ఈనెల 30 వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ GO No 182ను జారీ చేశారని పేర్కొన్నారు.
Similar News
News April 4, 2025
జూరాలలో పోలీస్ అవుట్ పోస్ట్‌కు డీజీపీ భూమి పూజ

వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నూతనంగా ఏర్పాటు చేసే పోలీస్ అవుట్ పోస్ట్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం భూమి పూజ చేశారు. రూ.కోటితో దీనిని నిర్మించినట్లు డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఐజీ రమేశ్ రెడ్డి, డీఐజీ చౌహన్, ఎస్పీ రావుల గిరిధర్, కేశం నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News April 4, 2025
వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News April 4, 2025
మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.