News March 29, 2025
గద్వాల జిల్లా ప్రజలారా జర జాగ్రత్త…!

జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. శుక్రవారం గరిష్ఠంగా ధరూర్‌లో 40.8, భీమవరం, తోతినోనిదొడ్డిలో 40.7°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News September 18, 2025
NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకూడదు: VZM కలెక్టర్

శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి ఒక్కరి మదిలో పవిత్రంగా నిలిచిపోయేలా నిర్వహించాలని, పండగ శోభ ప్రతిబింబించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. పండగ ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. VIP దర్శనాలు వలన సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నారు.
News September 18, 2025
అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.