News February 28, 2025

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ సస్పెండ్..!

image

గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ తిరుపతిరావును సస్పెండ్ చేస్తూ సీఎండి ముషారఫ్ ఫరూకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ధరూర్ మండలం అల్వాలపాడు సబ్ స్టేషన్ వద్ద బుధవారం కరెంటు కోతలకు నిరసనగా రైతులు ఆందోళన చేశారు. జూరాల నుంచి కాలువలకు నీళ్లు వదులుతున్నప్పటికీ కరెంటు కోతలతో సకాలంలో నీరందించక పంటలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. దీంతో ఎస్‌ఈపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News March 1, 2026

పోకో, రెడ్‌మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

image

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్‌మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.

News March 1, 2026

నెలకు రూ.74వేల జీతం.. NPCILలో ఉద్యోగాలు

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(<>NPCIL<<>>)లో 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 4వరకు అవకాశం ఉంది. GATE-2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.74,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in

News March 1, 2026

ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బి.ఎస్సీ. చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 13 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరారు.