News November 26, 2025

గద్వాల: జీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: ఈసీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజర్వేషన్లు, విడతల వివరాలు, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను టీఈ-పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ ఆఫీసర్‌ను నియమించి, గ్రీవెన్స్ ప్లాట్‌ఫామ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News November 28, 2025

ప్రకృతి వ్యవసాయం.. బాపట్ల కలెక్టర్ ప్రశంసలు

image

అమృతలూరు మండలం గోవాడకు చెందిన మహిళా రైతు దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. దీంతో శుక్రవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆమెను ప్రశంసించారు. కేవలం 1 ఎకరం భూమిలో సహజ వ్యవసాయం చేస్తూ A-గ్రేడ్, ATM, PMDS పద్ధతులను సమర్థంగా అమలు చేస్తూ పంటల వైవిధ్యాన్ని పెంచారన్నారు. 30 రకాల విత్తనాలతో నెలకు రూ.1,21,000ల ఆదాయం అర్జిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.

News November 28, 2025

ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్‌క్వార్టర్‌గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్‌క్వార్టర్‌గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.

News November 28, 2025

పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

image

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <>ప్రాంప్ట్<<>> వాడి మీరూ ట్రై చేయండి.