News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 13, 2026

NZB: సహజీవనం.. మహిళ చేతిలో వ్యక్తి హత్య

image

NZB వినాయక్ నగర్‌లో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బద్ధ సౌందర్య అనే మహిళతో మేస్త్రి పని చేసే జక్కులోళ్ల మోహన్(40) సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవ కారణంగా సౌందర్య తన చీరతో మోహన్ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. మృతుడి బంధువుల వివరాలు తెలియలేదు. సమాచారం తెలిస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.

News April 13, 2026

NZB: ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: CP

image

ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దామని NZB పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్‌లో భాగంగా సోమవారం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.

News April 13, 2026

NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 124 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు అందజేశారు.