News November 13, 2025
గద్వాల: డీకే అరుణకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఆమెను సభ్యురాలిగా నియమించారు. జమ్మూ కశ్మీర్ పునశ్చరణ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలనూ ఈ కమిటీ పరిశీలిస్తుంది.
Similar News
News November 13, 2025
విజయవాడలో దారుణ హత్య

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. విజయ టాకీస్ సమీపంలోని విన్స్ హాస్పిటల్లో పనిచేసే మహిళను ఆమె భర్త గురువారం మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఆలీ తెలిపారు.
News November 13, 2025
వరంగల్: మహిళల భద్రత కోసం షీ బాక్స్..!

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు వరంగల్ పోలీసు శాఖ మహిళలకు స్ఫూర్తిదాయక పిలుపునిచ్చింది. ఏ మహిళైనా పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే లేదా అలాంటి ఘటనను గమనించినా, వెంటనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SHe-Box వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.
News November 13, 2025
భూ కబ్జా ఆరోపణలు.. పవన్‌కు వైసీపీ సవాల్

AP: డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూ కబ్జా పేరిట <<18274471>>Dy.CM పవన్<<>> నిరాధార ఆరోపణలు చేస్తున్నారని YCP మండిపడింది. ‘ఈ భూములన్నీ 2000-2001 మధ్య కొన్నవి కాదా? ఇవి నిజాలు కావని నిరూపించగలరా’ అని పవన్‌కు సవాల్ విసురుతూ డాక్యుమెంట్ల వివరాలను Xలో షేర్ చేసింది. ‘పెద్దిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా’ అని పేర్కొంది.


