News August 29, 2025
గద్వాల: ‘తుది ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి’

తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలోని ఆయన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని అన్ని జీపీ ఆఫీసుల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ఈనెల 28న ప్రదర్శించామన్నారు. 30 వరకు అభ్యంతరాల స్వీకరించి 31న పరిష్కరిస్తామన్నారు.
Similar News
News August 30, 2025
సిద్దిపేట: శేరిపల్లి పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు

దౌల్తాబాద్ మండలం శేరిపల్లిలోని ప్రాథమిక పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఎస్‌సీఈఆర్‌టీ ప్రచురించిన ‘ట్రైల్ బ్లేజర్స్’ అనే పుస్తకంలో ఈ పాఠశాల గురించి ఓ కథనం వచ్చింది. పాఠశాల టీచర్ బి.రవి రాసిన ‘పాఠశాల సమావేశాల్లో తల్లిదండ్రులను సులభంగా పాల్గొనేలా చేయొచ్చు’ అనే కథనానికి పేజీ నంబర్లు 277, 281లో చోటు దక్కింది. తల్లిదండ్రులు, టీచర్లు, దాతల సహకారంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని రవి తెలిపారు.
News August 30, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 30, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.43 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.31 గంటలకు
✒ ఇష: రాత్రి 7.45 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 30, 2025
ఐఫోన్ 17 సిరీస్ ధరలు మరింత ప్రియం!

వచ్చే నెల 9న ఐఫోన్ 17 సిరీస్ విడుదల కానుంది. ఈ సారి వచ్చే మోడళ్లలో లేటెస్ట్ అప్‌గ్రేడ్‌లు ఉండటంతో ధరలు కూడా భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలు అమెరికాలో లీకయ్యాయి. వాటి ప్రకారం మనదేశంలో ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,10,100, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,990 వరకు ఉండొచ్చని అంచనా.