News October 16, 2025

గద్వాల: ‘తెలంగాణ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి’

image

పుదుచ్చెరి మాజీ సీఎం నారాయణస్వామి ఈరోజు గద్వాలను సందర్శించారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు ఆయనకు వినతిపత్రం అందజేశారు. విద్య, ఉపాధి, మౌలిక వసతుల పరంగా గద్వాల, అలంపూర్‌ ప్రాంతాలు వెనుకబడ్డాయని తెలిపారు. గతంలో రాయచూర్ పరిధిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డికి చేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Similar News

News October 17, 2025

నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

image

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.

News October 17, 2025

చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

image

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>

News October 17, 2025

ఒక్కటైనా నేపాల్ అమ్మాయి- కామారెడ్డి అబ్బాయి

image

కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తెల్గపూర్ వాసి రవీందర్, నేపాల్ యువతి ప్రేమించుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న రవీందర్ తన కార్యాలయంలో పనిచేస్తున్న నేపాల్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈ జంట ఇండియాకు వచ్చి గురువారం తెల్లాపూర్ గ్రామంలో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామస్తులు, నాయకులు వివాహానికి హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు.