News April 5, 2025

గద్వాల: నకిలీ సీడ్స్ రాకుండా నియంత్రించాలి: డీజీపీ

image

రాబోయే వర్షా కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ సీడ్స్ జిల్లాలోకి రాకుండా నియంత్రించాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ ప్రివెంటివ్ చర్యలు చేపట్టాలని డీజీపీ డా.జితేందర్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ధరూర్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం గద్వాల జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ పాల్గొని మాట్లాడారు.

Similar News

News April 12, 2025

వైసీపీ పీఎస్సీ సభ్యులుగా మాజీ మంత్రులు 

image

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావుని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు జాబితా విడుదల చేశారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్‌గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని పార్టీ విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

News April 12, 2025

అమలాపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా పినిపే

image

AP: వైసీపీ పలు పదవులకు నియామకాలు చేపట్టింది. అమలాపురం అసెంబ్లీ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పినిపే శ్రీకాంత్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని నియమించింది.

News April 12, 2025

WhatsApp గ్రూపుల్లో మెసేజులు వెళ్లట్లేదు!

image

WhatsAppలో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. గ్రూపుల్లో మెసేజులు సెండ్ అవ్వట్లేదు. దీంతో యూజర్లు, ముఖ్యంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మెటా ఇంకా స్పందించలేదు. పర్సనల్ మెసేజులు మాత్రం ఏ సమస్య లేకుండా డెలివరీ అవుతున్నాయి. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?

error: Content is protected !!