News December 14, 2025
గద్వాల: నాలుగు మండలాల్లో 95,592 ఓట్లు నమోదు

గద్వాల జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరిగిన 4 మండలాల్లో 1,12,087 మంది ఓటర్లు ఉండగా 95,592 మంది ఓటు వేశారు. అయిజ మండలంలో 39,377 మంది ఓటర్లకు 32,563 మంది, మల్దకల్ మండలంలో 37,915 మంది ఓటర్లకు 30,548 మంది, వడ్డేపల్లి మండలంలో 7,477 మంది ఓటర్లు ఉండగా 6,442 మంది, రాజోలి మండలంలో 28,038 మంది ఓటర్లకు 23,039 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News December 14, 2025
దంతాలపల్లి సర్పంచ్‌గా బాలాజీ

దంతాలపల్లి మండల కేంద్ర సర్పంచ్‌గా యువ నాయకుడు పొన్నోటి బాలాజీ గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన వీరబోయిన కిషోర్‌పై 114 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తమ నాయకుడు గెలుపొందడంతో దంతాలపల్లి ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. ఈ విజయానికి బాలాజీ సంపూర్ణ అర్హుడని స్థానికులు కొనియాడారు.
News December 14, 2025
హనుమకొండ: సర్పంచ్‌గా అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య..!

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అడేపు స్రవంతి దయాకర్ 142 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆమె గెలుపు ఖరారైంది. గతంలో ఆమె భర్త అడేపు దయాకర్ సర్పంచ్‌గా పని చేయగా, ఇప్పుడు స్రవంతి ప్రజల మద్దతుతో పీఠాన్ని దక్కించుకున్నారు. గ్రామంలో ఆమె గెలుపుతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
News December 14, 2025
పెద్దగూడెం సర్పంచ్‌గా పుష్పలత శివకుమార్

పెద్దగూడెం గ్రామ సర్పంచ్‌గా స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ మద్దతురాలు పుష్పలత శివకుమార్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పై 749 ఓట్ల భారీ మెజార్టీ గెలుపొందారు. అదేవిధంగా 12 వార్డులకు గాను 11 వార్డులలో వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పుష్పలత శివకుమార్‌ను శివసేనారెడ్డి అభినందించారు.


