News March 24, 2025
గద్వాల: ‘నీళ్లు ఇచ్చే దాకా కదలం’

అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీళ్ల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. సుమారు పన్నెండు గ్రామాల రైతులు మాట్లాడుతూ.. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగు నీరు అందించాలని కోరారు. నీళ్లు ఇచ్చేదాకా కదలమని భీష్మించుకుని కూర్చున్నారు.
Similar News
News April 5, 2026
నిర్మల్: రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ రద్దు

నిర్మల్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపురద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, యంత్రాంగమంతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News April 5, 2026
యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.
News April 5, 2026
జిల్లాలో త్వరలో డోలి యాత్ర: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని, పూర్తయిన పనులపై ఈ యాత్ర ద్వారా పరిశీలిస్తామన్నారు.


