News February 2, 2026

గద్వాల: నేటినుంచి రెండో విడత CM కప్ క్రీడలు

image

గద్వాల జిల్లాలో ఈనెల 2,3 తేదీల్లో రెండో విడత సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి (DYSO) కృష్ణయ్య తెలిపారు. గద్వాల, అలంపూర్, అయిజ వంటి పలు మండలాలు, మున్సిపాలిటీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News February 18, 2026

టెన్త్ పరీక్షల గ్యాప్‌లోనూ క్లాసులు!

image

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్‌లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

News February 18, 2026

మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

image

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.

News February 18, 2026

పాడేరు: ‘పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు’

image

పింఛన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎంతటి అధికారికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్‌లో, లబ్దిదారులకు ఏ విధమైన ప్రశ్నకు సంతృప్తి చెందితే సమాధానంగా ఏ బటన్ ప్రెస్ చెయ్యాలో తెలియజేయాలని సూచించారు.