News March 20, 2025
గద్వాల: ‘పదో తరగతి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి’

గద్వాల జిల్లాలో మార్చ్ 21 – ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. సరైన సౌకర్యాలు లేని కారణంగా ప్రతి ఏడాది పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, సరైన మరుగుదొడ్లు లేకపోవడం, కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక, సమయానికి బస్సులు రాక సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 21, 2025
బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు: కిషన్ రెడ్డి

బొగ్గు ఉత్పత్తిలో భారత్ 1 బిలియన్ టన్నుల మైలురాయిని అధిగమించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో ఉత్పత్తిని పెంచాం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఇది పరిష్కారం చూపుతుంది. ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును ఇస్తుంది. మోదీ నాయకత్వంలో గ్లోబల్ ఎనర్జీ లీడర్‌గా భారత్ ఎదుగుతోంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
News March 21, 2025
ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు.
News March 21, 2025
కర్నూలులో TDP నేత దారుణ హత్య.. వివరాలు వెల్లడించిన ఎస్పీ

రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు, వర్గ పోరుతోనే TDP నేత సంజన్నను హత్య చేశారని SP విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. కర్నూలులోని శరీన్ నగర్లో ఈనెల 14న సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వడ్డే ఆంజనేయులు, శివకుమార్, తులసి, రేవంత్, అశోక్ ఉన్నారని పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, కార్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.