News February 28, 2025

గద్వాల: ‘పవిత్ర రంజాన్ మాసానికి ఏర్పాట్లు చేయాలి’

image

ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్షలు సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో చేపట్టిన ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

Similar News

News December 19, 2025

హాదీ మృతితో బంగ్లాలో అల్లర్లు.. ఎవరతడు?

image

రాడికల్ ఇంక్విలాబ్ మోర్చాకు చెందిన కీలక నేత షరీఫ్ <<18609088>>ఉస్మాన్<<>> హాదీ. హసీనాను PM పదవి నుంచి దించేందుకు చేసిన ఘర్షణలకు ఆయనే నాయకత్వం వహించారు. దీంతో బంగ్లాలో హాదీ హీరో అయ్యారు. 2026 FEBలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఈ నెల 12న ఢాకాలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా నిన్న చనిపోయారు. దీంతో ఆయన మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు.

News December 19, 2025

MBNR: నేడు సౌత్ జోన్ టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను శుక్రవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఎంపికలు పాలమూరు యూనివర్సిటీలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు. ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు.

News December 19, 2025

ఎప్‌స్టీన్ ఫైల్స్: ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’

image

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ <<18547375>>ఎస్టేట్‌<<>>లోని మరిన్ని ఫొటోలను US హౌస్‌ డెమొక్రాట్ల కమిటీ రిలీజ్ చేసింది. మొత్తం 68 ఫొటోల్లో బిల్ గేట్స్, నోవమ్ చోమ్‌స్కీ, వూడీ అలెన్ వంటి వాళ్లు ఉన్నారు. ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’ అంటూ ఉన్న మెసేజీలు, పేర్లు బ్లర్ చేసిన రష్యా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాల మహిళల పాస్‌పోర్టులూ ఉన్నాయి. కమిటీ వద్ద మొత్తం 95 వేల ఇమేజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.