News July 8, 2025
గద్వాల: ‘ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలి’

పంచాయతీ కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామస్థాయిలో పూర్తిగా అమలు చేసి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్‌లో పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర అత్యంత ముఖ్యమైందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరే విధంగా చూడలన్నారు.
Similar News
News July 8, 2025
ఉత్కృష్ట సేవా పథకానికి జనగామ డీసీపీ ఎంపిక

పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన వారిని భారత ప్రభుత్వం గుర్తిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ 2025 సంవత్సరానికి ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికయ్యారు. ఈ మేరకు పోలీస్ అధికారులు, జర్నలిస్టులు, పట్టణ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.
News July 8, 2025
జనగామ: ‘సమ్మెను విజయవంతం చేయాలి’

రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులు అన్నారు. జనగామలోని రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో ఈరోజు ఆటో కార్మికులు సమావేశాలను నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. CITU జిల్లా కమిటీ మెంబర్ ప్రశాంత్, ఆటో యూనియన్ నేతలు మల్లేశ్, అశోక్, అలీ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
News July 8, 2025
జనగామ ఎమ్మెల్యేను కలిసిన ప్రభుత్వ విప్

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు ఇరు నియోజకవర్గాలకు సంబంధించి అంశాలపై నేతలు చర్చించారు. జనగామ ఎమ్మెల్యేను నేడు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు పరామర్శించారు.