News November 10, 2025
గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Similar News
News November 10, 2025
అల్లూరి జిల్లాలో 1.69లక్షలు మందికి పరీక్షలు: DEO

అల్లూరి జిల్లాలో 2904 ప్రభుత్వ పాఠశాలల్లో 1.69లక్షల మంది విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్- 1 పరీక్షలు ప్రారంభం అయ్యాయని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో జరుగుతున్న పరీక్షను ఆయన పరిశీలించారు. ప్రతీ పాఠశాలలో క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించాలని టీచర్స్‌ను ఆదేశించారు. ఈ పరీక్షలు ఫలితాలు ఆధారంగా విద్యార్థికి చదువు చెప్పాలన్నారు.
News November 10, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్‌కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు
News November 10, 2025
NZB: అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్‌ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.


