News January 3, 2026

గద్వాల: ‘ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలి’

image

రైతుల భూములు, పంటలు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసి యూనిక్ ఐడి ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి సూచించారు. శనివారం ఐడీఓసీ మందిరంలో విలేజ్ లెవెల్ ఎంటర్ ప్లీనర్లకు ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు సులభంగా అందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉపయోగపడుతుందని వివరించారు.

Similar News

News January 20, 2026

స్టేషన్ ఘనపూర్ మోడల్ స్కూల్‌లో పార్ట్‌టైం యోగా టీచర్ నోటిఫికేషన్

image

స్టేషన్ ఘనపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల శారీరక-మానసిక ఆరోగ్య అభివృద్ధి కోసం యోగా బోధించేందుకు పార్ట్‌టైం యోగా టీచర్/ పార్ట్‌టైం వ్యాయామ ఉపాధ్యాయులు అవసరమని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. యోగా లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో కలిసి 22-01-2026 లోగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

News January 20, 2026

జనగామ: ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై సమీక్ష

image

జనగామ జిల్లాలో ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ ఆఫీసర్ రిషికాంత్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు సులభతరంగా రుణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

News January 20, 2026

సూచీలు కుప్పకూలడానికి కారణాలు ఇవే

image

దేశీయ స్టాక్ మార్కెట్లు <<18907026>>భారీ నష్టాలు<<>> చూసిన విషయం తెలిసిందే. EU దేశాలతో అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడం అంతర్జాతీయంగా అనిశ్చితికి కారణమైంది. అదే సమయంలో నిన్న విదేశీ మదుపర్లు రూ.3,262 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత పతనం కావడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అమ్మకాల ఒత్తిడిని పెంచింది.