News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేట్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 1, 2025

గుంటూరు: 63.4% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 63.4% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,53,464 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,60,700 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసినట్లు అధికారిక డాష్‌బోర్డు ద్వారా తెలుస్తోంది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీకి రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.

News February 1, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్‌లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 1, 2025

జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.