News April 5, 2024
గద్వాల: బొలెరో బోల్తా.. ఇద్దరు మృతి

గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్ శివారులో ఉదయం <<12993576>>బొలెరో బోల్తా<<>> పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన బాలుడు మనోజ్ అక్కడే మృతిచెందగా, ఉప్పరి నాగప్ప అనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రాయచూరు జిల్లా ఇనపనూరుకు చెందిన నాగప్ప చిన్నోనిపల్లికి చెందిన బంధువులతో కలిసి ఏపీలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News September 11, 2025
MBNR: వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలి- శ్రీనివాస్ గౌడ్

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
News September 11, 2025
MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

MBNR(D) నవాబ్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్‌పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News September 11, 2025
భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

మహబూబ్‌నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్‌లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.