News April 23, 2025

గద్వాల: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. బుధవారం కేటీ.దొడ్డి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని, చట్టం, అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

Similar News

News April 23, 2025

సిరిసిల్ల: అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ

image

పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సిరిసిల్ల పట్టణ పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఆయన బుధవారం హెల్మెట్లు అందించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులకు ఆయన సూచించారు.

News April 23, 2025

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

TG: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. మే 22 నుంచి 29 వరకు 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం ప‌రీక్షలు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సెకండియర్ ఎగ్జామ్స్ మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జరగనున్నాయి. పూర్తి టైమ్ టేబుల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 23, 2025

HYD – WGL హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ వద్ద కారు ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆలేరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!