News October 16, 2025
గద్వాల: మద్యం దుకాణాలకు 127 దరఖాస్తులు

గద్వాల జిల్లాలోని ప్రభుత్వం నియమించిన 34 మద్యం దుకాణాలకు బుధవారం వరకు వచ్చిన దరఖాస్తులు గద్వాల్ 71, అలంపూర్ 56 జిల్లా వ్యాప్తంగా మొత్తం 127 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున దరఖాస్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అన్నారు.
Similar News
News October 16, 2025
విశాఖలో ఆ కార్పొరేటర్ అంటేనే భయపడుతున్నారు!

జీవీఎంసీలో ఓ కార్పొరేటర్ వ్యవహారం బ్లాక్ మెయిల్ తరహాలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లు గడించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీ హయాంలోనూ నాయకులపై విరుచుకుపడ్డ ఆయన.. ఇప్పుడు కూటమి నాయకులపైనా ఆరోపణలు చేసేస్తున్నారట. దీంతో ఆయనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నేతలు కామ్‌గా ఉంటున్నారని సమాచారం.
News October 16, 2025
తోతాపురం సబ్సిడి పడలేదా.. ఇలా చేయండి.!

తోతాపూరి మామిడి రైతులకు అందించిన సబ్సిడీపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. తమ సందేహాలను 08572-242777 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చాన్నారు. అర్హత ఉన్నా నగదు జమకాని రైతులు రైతు సేవా కేంద్రాలు, హార్టికల్చర్ కార్యాలయాలలో ఈనెల 30లోపు వినతి పత్రాలు అందజేయాలన్నారు. రెండు రోజుల్లో వాటిని పరిష్కరిస్తామన్నారు.
News October 16, 2025
BREAKING: ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.