News April 4, 2025

గద్వాల: మహిళా డిగ్రీ కాలేజీలో మాదక ద్రవ్యాలపై అవగాహన

image

గద్వాలలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఈరోజు ప్రిన్సిపల్ Dr.A.మీనాక్షి అధ్యక్షతన విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. యువతను డ్రగ్స్ ముఠా టార్గెట్ చేసి మాదక ద్రవ్యాలను అలవాటు చేసి, వ్యాపారం చేయిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. 

Similar News

News February 19, 2026

బాలికకు ఫ్లయింగ్ కిస్.. నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష

image

ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడమూ లైంగిక వేధింపులేనని ముంబై స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. తొమ్మిదేళ్ల కిందట 16 ఏళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష, ₹3K ఫైన్ విధించింది. 2017లో ఓ ఈవెంట్‌లో 19 ఏళ్ల యువకుడు బాలికకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే వెనక నుంచి పట్టుకొని తన వైపునకు లాగాడు. దీంతో బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదవగా తాజాగా తీర్పు వెలువడింది.

News February 19, 2026

హస్తినలో జగ్గారెడ్డి ‘కమ్మ’ రాయబారం!

image

TGలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు మార్చి16న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌కి ఉన్న మెజారిటీతో వారి ఖాతాలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. VH అధిష్ఠానానికి లేఖ రాయగా, కీలక నేతలూ ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన జెట్టి కుమార్‌కు అన్యాయం జరిగిందని, ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టిగా కోరుతున్నారు.

News February 19, 2026

పెదవేగిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి

image

పెదవేగి మండలం మొండూరు గ్రామానికి చెందిన సత్యవతి (85) స్థానికంగా భర్తతో కలిసి జీవిస్తుంది ఈనెల 17వ తేదీన ఇంటి వద్దనే ఉదయం దీపారాధన చేసుకుంటుంది. ఈ సమయంలో చీర కొంగుకు నిప్పు అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైంది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది.