News January 12, 2026
గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు, యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా విడుదలైనందున మిగిలిన ఎన్నికల ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News January 23, 2026
KNR: మొక్కుల ‘బంగారం’.. షాపుల వద్ద సందడి!

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మేడారం జాతర సందడి నెలకొంది. సమ్మక్క-సారలమ్మ తల్లులకు ‘నిలువెత్తు బంగారం'(బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని కిరాణా దుకాణాలు బెల్లం ముద్దలతో కళకళలాడుతున్నాయి. వ్యాపారులు భారీగా బెల్లం నిల్వలను అందుబాటులో ఉంచారు. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో తల్లుల నామస్మరణ మారుమోగుతోంది. జాతర నేపథ్యంలో వ్యాపారాలు జోరందుకున్నాయి.
News January 23, 2026
గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్’, ‘రెస్టిన్’ హోటల్ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.
News January 23, 2026
మరణం లేని యోధుడు నేతాజీ!

మాటలతో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అంటూ దేశాన్ని కదిలించారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’తో బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్‌లో ఏర్పాటుచేశారు. 1945 ఆగస్టు 18న బోస్ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. కానీ ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. ఇవాళ నేతాజీ జయంతి.


