News February 15, 2026

గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు మూడంచెల భద్రత

image

గద్వాల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మూడంచెల భద్రతతో పాటు 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల అనంతరం ర్యాలీలు, డీజేలు నిర్వహించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News March 7, 2026

NZB: అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి: సుదర్శన్ రెడ్డి

image

ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. NZB కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో కూడిన అంశాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.

News March 7, 2026

ఖమేనీ పాలనలో దిగజారిన ఇరాన్ ప్రతిష్ఠ

image

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో నాయకత్వ సంక్షోభం ముదిరింది. 1981 నుంచి అధికారంలో ఉన్న ఆయన పాలనలో ఆ దేశం అంతర్జాతీయ సూచీల్లో అట్టడుగుకు పడిపోయింది. 2025 అవినీతి సూచీలో 153వ స్థానం, పత్రికా స్వేచ్ఛలో 176వ స్థానంతో దారుణమైన స్థితికి చేరింది. ప్రజాస్వామ్యం, పౌర హక్కుల విషయంలోనూ నిరంకుశ పాలనలోనే ఉందని రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. సుదీర్ఘ రాజకీయ స్థిరత్వం ఉన్నప్పటికీ సుపరిపాలన అందించడంలో ఖమేనీ విఫలమయ్యారు.

News March 7, 2026

ఈరోజు నమాజ్ వేళలు (07-3-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.30 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.